మా ఫ్రెండ్ గోవిందంది షేర్ బిజినెస్ లో అందెవేసిన చెయ్యి! వాడ్ని కదిలించడమే పాపం, తాజా మార్కెట్ పరిణామాలతో రెడీగా ఉంటాడు. మార్కెట్ వొడిదుడుకులకు తనదైన శైలిలో సమీకరణలు నిర్వచిస్తూ ఎలా మార్కెట్ లో నిలబడాలో చాలా వింతగా చెపుతాడు. అలాంటిది, మా వాడు, వో రెండు రోజులు బయటెక్కడా కనిపించలేదు. తర్వాత, వో రోజు బస్ స్టాప్ లో కలిసాడు. మొన్నటి దాకా ౧౮౦౦౦ క్యాండిల్స్ వెలుగుతో వున్నమొహం కాస్తా ౯౦౦౦ క్యాండిల్స్ కి వాడిపోయింది. వద్దు అనుకుంటూనే వాడ్ని కదిలించాను. నేటి మార్కెట్ పరిస్థితికి వాడు ఇచ్చిన కొత్త సమీకరణం 'పుటుక్కు జర జర డుబుక్కు మే' !...చాలా ఆసక్తిగా అనిపించి కొంచెం వివరించమన్నా! మా వాడు రెచ్చిపోయాడు...ఇలా... "అమెరికా చాలా అందమైన పూరి గుడిసె అని..దాని పై అల్లుకున్న అందమైన గుమ్మడి పాదు దాని ఆర్ధిక వ్యవస్థ అని...ఆ పూరి గుడిసె కింద...వో...ప్రక్కన...వో మేక (బుల్ కాదని మనవి)..అదే మన...షేర్ మార్కెట్ అని...ఎవడో రియల్ ఎస్టేట్ దొంగ.... గుమ్మడి కాయల్ని 'పుటుక్కు' మని (ఎవ్వరూ భుజాలు తడుముకో వద్దని మనవి) తుంచితే... అందులో వొకటి..జర..జర..మని దొర్లుతూ...డుబుక్కు మని మన మేక పై పడితే అది మే అని అరిచింది. ఏమిటని చుస్తే దాని కాలువిరిగి కుంటిడైంది...ఇది..నా సమీకరణం వెనకున్న కధ...అర్ధమైందా?..." చెప్పడం ఆపాడు. తేరుకోడానికి వో నాలుగు సెకండ్లు అయింది. "ఆ అర్ధ...మైంది...అంటూ...ఏదో...ఫోన్ వస్తున్నా వాడిలా నటిస్తూ...మళ్లీ కలుద్దాం" అని జారుకున్నా! ఏ మాటకి ఆ మాటే. మన వాడి సమీకరణం ఏదో అతికినట్లుగా అనిపిస్తోంది కదూ! అదే మన 'గోవిందం' గొప్పదనం!
19 నవంబర్ 2008
06 నవంబర్ 2008
విజేత ఎలా ఉంటాడు?
"విజేత పనులను కొత్తగా చేస్తారు..కొత్త పనులను చెయ్యరు"..ఇది మనందరం విన్న సామెత. ఎలాగో చూస్తాం.
1. నిరాశావాది గాలి ఎదురు వీస్తుందే అని భాద పడితే, ఆశావాది గాలికి అనుగుణంగా మరను తిప్పుతాడు. అదే విజేత గాలి ఎప్పుడు ఎటు వీచినా మర తనకు తానే తదనుగుణంగా తిరిగే ఏర్పాటు చేస్తాడు.
౨. నిరాశావాది గులాబీల వెనుక ముల్లుని చూస్తే, ఆశావాది గులాబీల అందాన్ని ఆస్వాదిస్తాడు. విజేత గులబిలతో ఓ మంచి మాలనో, బోకేనో చేస్తాడు.
౩. నిరాశావాది మంచి నీటి గ్లాసు ఇంక సగం నింపలేదని భాద పడితే, ఆశావాది గ్లాసు సగం నిండి ఉండడాన్ని చూసి సంతోషపడుతాడు. విజేత మిగతా సగాన్ని నీటితో నింపడానికి ప్రయత్నిస్తాడు.
౪. నిరాశావాది తన చేతగానితనానికి కారణాన్ని వెదుకుతాడు. ఆశావాది తాను చేయగలిగిన పనికి సంతోష పడుతాడు. విజేత పనిలో నేర్పరితనం, నైపుణ్యం కోసం శ్రమిస్తాడు.
అందుకే, ఆశవాదులందరూ విజేతలు కాలేరు...కానీ విజేతలందరూ ఆశవాదులే!!! మనం విజేతలుగా నిలవడానికి కృషి చేస్తాం.

05 నవంబర్ 2008
సెల్ఫ్ డబ్బా!
నా గురించి ఎందుకు గాని, ఈ బ్లాగ్ గురించి మనం చెప్పుకుందాం. ఇది మనందరి కోసం. అన్నీరకాల కబుర్లు చెప్పుకుందాం. కధలు, వింతలు, విశేషాలు, రాజకీయాలు, క్రీడలు, సినిమాలు, పిల్లలు, చదువులు ఇంకా చాలా చాలా కబుర్లు, సెటైర్లు, అరుపులు, చురకలు.....అన్నీ....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)